అజయ్, వంశీ, ఆదిత్య శశాంక్, రోమిక శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం వి లవ్ బ్యాడ్ బాయ్స్. రాజు రాజేంద్రప్రసాద్ దర్శకత్వం. పప్పుల కనక దుర్గారావు నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. యు.ఏ.సర్టిఫికెట్ లభించింది. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ను యువ దర్శకుడు వశిష్ట విడుదల చేశారు. నిర్మాత మాట్లాడుతూ వినూత్నమైన కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నేటి యువత కు కనెక్ట్ అయ్యే అన్ని అంశాలుంటాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం అని అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: వి.కె.రామరాజు, సంగీతం: రఘు కుంచె, భూషణ్ జాన్, సంభాషణలు, స్క్రీన్‌ప్లే: ఆనంద్ కొడవటిగంటి.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)