విశ్వక్‌సేన్ అఘోరా పాత్రలో నటిస్తున్న చిత్రం గామి. విద్యాధర్ కాగిత దర్శకుడు. అడ్వెంచరస్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా మార్చి 8న ప్రేక్షకుల ముందుకురానుంది. హారిక పెడాడ, మహ్మద్ సమద్ తదితరులు నటిస్తున్నారు. ఇందులో మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడే అఘోరా పాత్రలో విశ్వక్‌సేన్ నటించారు. ఈ సినిమాలో యువ నాయిక చాందిని చౌదరి, జాహ్నవి పాత్రలో నటిస్తున్నది. ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అఘోరాగా కనిపించే కథానాయకుడితో కలిసి ఆమె చేసే సాహస యాత్ర సినిమాలో ఆసక్తికరంగా ఉంటుందని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: విశ్వనాథ్ రెడ్డి, సంగీతం: నరేష్ కుమారన్, నిర్మాత: కార్తీక్ శబరీష్, దర్శకత్వం: విద్యాధర్ కాగిత.