దీపక్ సరోజ్ హీరోగా రూపొందుతున్న చిత్రం సిద్దార్థ్‌రాయ్. తాన్వి కథానాయిక. వి.యశస్వి దర్శకుడు. జయ అడపాక, ప్రదీప్ పూడి, సుధాకర్ బోయిన నిర్మాతలు. నేడు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అతిథులుగా వచ్చిన కిరణ్ అబ్బవరం, కోనవెంకట్, నక్కిన త్రినాథరావు చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు అందించారు. ఇంకా దీపక్ సరోజ్ మాట్లాడుతూ ఒక రాంగ్ ఫిలాస ఫీలో ఇరుక్కుపోయి జీవితాన్ని ఇబ్బందులపాలు చేసుకున్న ఓ జీనియస్ కథ సిద్దార్థ్ రాయ్. అతని ఎమోషన్, అతని ప్రేమ భరించడం కష్టం. ఆకలితోవున్న ఒక నటుడికి ఇంతకంటే మంచి పాత్ర వస్తుందా? అనిపించిం ది. కథ విన్నాక ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి అన్నాడు. నన్ను నేను నిరూపించుకోటానికే ఈ సినిమా చేశాను. సాంకేతికంగా అద్భుతంగా ఉంటుందీ సినిమా అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ సినిమాలపై ఉన్న ప్రేమతో ఈ రంగంలోకి వచ్చానని, నా ప్రయాణంలో సహకరించిన అందరికీ ధన్యవాదాలని తెలిపారు. ఇంకా హీరోయిన్ తన్వి కూడా మాట్లాడారు.