అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి తీవ్ర పదజాలంతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై విరుచుకు పడ్డారు. ఆయన వల్ల అణుయుద్ధం రూపంలో మానవాళి మనుగడకు ముప్పు పొంచి ఉందన్నారు. శాన్‌ఫ్రాన్సిస్కోలో విలేఖరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పుతిన్ లాంటి వెర్రి వ్యక్తులు అధ్యక్షులుగా ఉన్నంతకాలం అణుయుద్ధం గురించి ఆందోళన చెందాల్సిందే. అలాంటి వ్యక్తులతో మానవాళి మనుగడకు ప్రమాదం. రష్యా పై కొత్త ఆంక్షలు విధిస్తాం అని బైడెన్ తెలిపారు. డొనాల్డ్ ట్రంప్‌పై కూడా బైడెన్ విమర్శలు చేశారు. రష్యా ప్రతిపక్ష నాయకుడు నావల్నీ మృతికి , తాను ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకు ముడి పెడుతూ ట్రంప్ మాట్లాడటాన్ని బైడెన్ తప్పు పట్టారు. పుతిన్‌పై బైడెన్ విమర్శలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైన నాటి నుంచి పుతిన్ విధానాలపై బైడెన్ తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)