Namaste NRI

ఆకట్టుకుంటున్న అజయ్ దేవగన్ సైతాన్ ట్రైలర్

బాలీవుడ్ న‌టుడు అజయ్ దేవగన్, ఆర్ మాధవన్, జ్యోతిక ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్న తాజా చిత్రం షైతాన్. ఈ సినిమాకు వికాస్ బెహల్ ద‌ర్శ‌క‌త్వం. జియో స్టూడియోస్‌‌ సమర్పణలో అజయ్ దేవగన్‌‌, జ్యోతి దేశ్‌‌పాండే, అభిషేక్ పాఠక్ ఈ సినిమాను సంయ‌క్తంగా నిర్మిస్తున్నారు. విడుద‌ల తేదీ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌టంతో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్ స్టార్ట్ చేశారు. ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు టీజ‌ర్ విడుద‌ల చేయ‌గా,  ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంది. ఇదిలావుంటే తాజాగా సినిమా నుంచి చిత్ర‌యూనిట్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ గ‌మ‌నిస్తే వెకేషన్ కోసం మారుమూల గ్రామానికి వెళ్లిన అజయ్ దేవగన్ కుటుంబం అక్క‌డ ఒక అపరిచిత (మాధవన్) వ్యక్తి కారణంగా చిక్కుల్లో పడుతుంది. అయితే ఆ అపరిచిత వ్యక్తి ప్రయోగించిన బ్లాక్ మ్యాజిక్ నుంచి అజయ్ దేవగన్ త‌న కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు అనేది అనేది అసలు కథ. గుజరాతీ హారర్ థ్రిల్లర్ వష్  సినిమాకు ఈ చిత్రం రీమేక్‌గా వ‌స్తుంది. ఈ సినిమా మ‌హాశివ‌రాత్రి కానుక‌గా మార్చి 08న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events