బ్రిటన్ రాజకీయాలలో విష సంస్కృతి పెచ్చుమీరుతున్నదని బ్రిటిష్ ప్రధాని రిషి సునాక్ హెచ్చరించారు. ఇజ్రాయెల్- గాజా పోరుకు సంబంధించి కామన్స్ సభలో తమ వోటింగ్ ఉద్దేశాలపై పార్లమెంట్ సభ్యులు భద్రత ముప్పు ఎదుర్కొంటున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో సునాక్ ఈ హెచ్చరిక చేశారు. ముగ్గురు అజ్ఞాత మహిళా ఎంపిలు తమ భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసిన తరువాత వారికి అదనపు భద్రత మంజూరైనట్లు నేపథ్యంలో ఆయన ఆ ప్రకటన చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేందుకు, పొగిడేందుకు తీవ్రవాదులు చట్టబద్ధమైన నిరసనలను హైజాక్ చేయడం, ఎన్నికైన ప్రతినిధులను మౌఖికంగా బెదరించ డం, శారీరకంగా, దౌర్జన్యపూరితంగా లక్షం చేసుకోవడం, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు మన సొంత పార్లమెంట్ భవనంలోకి ప్రసారం చేశారు అని సునాక్ తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)