ఎర్ర సముద్రం లో వాణిజ్య నౌకలపై దాడులు ఆగడం లేదు. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు నానాటికీ రెచ్చిపోతున్నారు. ఎర్రసముద్రం మీదుగా రాకపోకలు సాగిస్తున్న వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడుల కు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ్డారు. గల్ఫ్ ఆఫ్ ఎడెన్ లో అమెరికా జెండాతో వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ నౌక ఎంవీ టార్మ్ థార్‌పై మిస్సైళ్లతో దాడి చేశారు. ఈ దాడి ఘటనలో ట్యాంకర్ నౌకకు కానీ, సిబ్బందికి గానీ ఎలాంటి నష్టం జరగలేదు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)