అంజలి నటించిన హారర్ సినిమా గీతాంజలి కి కొనసాగింపుగా వస్తున్న సినిమా గీతాంజలి మళ్లీ వచ్చింది. శివ తుర్లపాటి దర్శకుడు. కోన వెంకట్ నిర్మాత. దర్శకులు మలినేని గోపీచంద్, బాబీ, బుచ్చిబాబు సాన, హీరో శ్రీవిష్ణు అతిథులుగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఈ మూవీ టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. అంజలి మాట్లాడుతూ కథానాయికగా ఈ సినిమాతో 50 సినిమాలు పూర్తి చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. పదేళ్ల తర్వాత మళ్లీ ఈ తరహా సినిమా చేయగలిగాం అంటే అదంతా కోన వెంకట్‌గారి చలవే అన్నారు. పదేళ్ల క్రితం వచ్చిన గీతాంజలి లా ఈ సినిమా కూడా ట్రెండ్ సెట్టర్ అవుతుందని కోన వెంకట్ నమ్మకం వ్యక్తం చేశారు. ఇంకా చిత్రయూనిట్ మాట్లాడారు. మార్చి 22న ఈ విడుదల కానుంది.