వినాయక్ దేశాయ్, అపర్ణాదేవి జంటగా నటిస్తున్న చిత్రం రాధా మాధవం. దాసరి ఇస్సాకు దర్శకత్వం. ఈ చిత్రాన్ని గోనాల్ వెంకటేష్ నిర్మించారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. హృద్యమైన ప్రేమకథగా మెప్పిస్తుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మంచి స్పందన లభిస్తున్నది అని చెప్పారు. గ్రామీణ నేపథ్య ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీగా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతుందని, చక్కటి నిర్మాణ విలువలతో తెరకెక్కించామని నిర్మాత గోనాల్ వెంకటేష్ పేర్కొన్నారు. మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది.