విశ్వ కార్తీక్, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం కలియుగం పట్టణం. రమాకాంత్‌రెడ్డి దర్శకుడు. కథ, కథనం, మాటలు కూడా ఆయనే అందిస్తుండటం విశేషం. కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్‌లు నిర్మాతలు. చిత్రాశుక్ల ప్రధాన పాత్ర పోషిస్తున్నది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా జో జో లాలీ అమ్మ అంటూ సాగే గీతాన్ని దర్శకుడు వశిష్ట విడుదలచేసి చిత్రయూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. భాస్కరభట్ల రాసిన ఈ పాటను అజయ్ అరసాడ స్వరపరచగా, అనురాగ్ కులకర్ణి ఆలపించారు. ఈ పాట సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. పోస్ట్‌ప్రొడక్షన్ కూడా చివరి దశకు చేరుకుందని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా చరణ్ మాధవనేని. ఈ చిత్రం మార్చి 22న సినిమా విడుదల కానుంది.