అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం డొనాల్డ్ ట్రంప్‌ను వరించడం ఖాయమని తేలిపోయింది. నవంబరులో ఎన్నికల్లో దేశాధ్యక్షుడిగా ట్రంప్ విజయం సాధిస్తే, ఉపాధ్యక్ష పదవి ఎవరిని వరించవచ్చనేది ఆసక్తికరంగా మారింది. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి, సౌత్ డకోటా మహిళ గవర్నర్ క్రిస్టీ నోయెమ్‌లకు మితవాద ఓటర్ల నుంచి చెరి 15 శాతం ఓట్లు వచ్చాయి. ఈ అనధికార సర్వే వివరాలను వెల్లడిరచారు. భారత సంతతి నాయకురాలు తులసీ గబ్బర్డ్‌కు 9 శాతం మంది, న్యూయార్క్ ఎం.పి. ఎలిసి స్టెపానిక్, సౌత్ కరోలినా సెనెటర్ టిమ్ స్కాట్‌లకు చెరి 8 శాతం మంది మద్దతు లభించింది. ఉపాధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో వివేక్ రామస్వామికి గట్టి పోటీ ఎదురవుతోందని సర్వే ద్వారా స్పష్టమవుతోంది. వివేక్‌కు ప్రధాన పోటీదారుగా ఉన్న క్రిస్టి నోయెమ్ 2018లో ట్రంప్ మద్దతుతో సౌత్ డకోటాకు మొదటి మహిళ గవర్నర్‌గా ఎన్నికయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)