సీనియర్ పీఎంఎల్-ఎన్ నాయకురాలు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూతురు మరియం నవాజ్(50) పంజాబ్ ప్రావిన్స్‌కు తొలి మహిళా ముఖ్యమంత్రిగా ఎన్నికై రికార్డు సృష్టించారు. ఇమ్రాన్ ఖాన్ మద్దతు కలిగిన సున్నీ ఇత్తెహాద్ కౌన్సిల్ బహిష్కరించింది. అయితే 220 ఓట్లు తెచ్చుకున్న మరియం పాక్‌లో ఒక రాష్ర్టానికి సీఎంగా ఎన్నికైన మొట్టమొదటి మహిళగా చరిత్రకెక్కారు. ఇది ప్రతి మహిళకు లభించిన గౌరవంగా ఆమె అభివర్ణించా రు. తనను కష్టాలపాలు చేసి ధృడంగా మారేలా చేసిన ప్రత్యర్థులకు ఆమె ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. వారిపై ప్రతీకారాన్ని తీర్చుకోనని పరోక్షంగా మాజీ సైన్యాధ్యక్షుడు ఖమర్ జావేద్ బజ్వా, సీజేపీ సాకిబ్ నిసార్‌ను ఉద్దేశించి అన్నారు.