Namaste NRI

గ‌గ‌న్‌యాన్ వ్యోమ‌గాములు వీళ్లే .. ప‌రిచ‌యం చేసిన ప్ర‌ధాని మోదీ

 ఇస్రో త‌న గ‌గ‌న్‌యాన్ ప్రాజెక్టు కోసం వ్యోమ‌గాముల కు శిక్ష‌ణ ఇస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఆ ప్ర‌తిష్టాత‌క మిష‌న్‌కు ఎంపికైన వ్యోమ‌గాముల‌ను ప్ర‌ధాని మోదీ దేశానికి ప‌రిచ‌యం చేశారు. ఇస్రో కీర్తిని చాటే ఆ న‌లుగురి పేర్ల‌ను ఆయ‌న ఇవాళ ప్ర‌క‌టించారు. కేర‌ళ‌లోని తిరువనంత‌పురంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో గ‌గ‌న్‌ యాన్ మాన‌వ యాత్ర‌కు ఎంపికైన వ్యోమ‌గాముల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. గ్రూప్ కెప్టెన్ ప్ర‌శాంత్ బాల‌ కృష్ణ నాయ‌ర్‌, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణ‌న‌న్‌, గ్రూప్ కెప్టెన్ అంగ‌ద్ ప్ర‌తాప్‌, వింగ్ క‌మాండ‌ర్ శుభాన్షు శుక్ల పేర్ల‌ను ప్ర‌ధాని మోదీ ప్ర‌క‌టించారు. ఆ న‌లుగురికీ ఆయ‌న ఆస్ట్రోనాట్ వింగ్స్‌ను అంద‌జేశారు. తిరువ‌నంత‌ పురంలో ఉన్న విక్ర‌మ్ సారాభాయ్ స్పేస్ సెంట‌ర్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న ఆ న‌లుగురికీ వింగ్స్ బ్యాడీల‌ను ప్ర‌జెంట్ చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events