మలయాళంలో మోహన్‌లాల్, మీనా జంటగా నటించిన దృశ్యం సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. తక్కువ బడ్జెట్‌లో రూపొందిన ఈ సినిమా కేరళలో రికార్డు కలెక్షన్లు సాధించి దేశాన్ని ఆకర్షించింది. అదే కథను అదే పేరుతో వెంకటేశ్, మీనా జంటగా తెలుగులో రీమేక్ చేస్తే ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. కన్నడలో దృశ్య పేరుతో, తమిళంలో పాపనాశంగా రూపొంది, విడుదలైన ప్రతి భాషలో విజయ దుంధుభి మోగించిందీ కథ. ఈ కథకు కొనసాగింపైన దృశ్యం-2 కూడా సూపర్‌హిట్. భారతీయ భాషల్లో అమో ఘ విజయాలను అందుకున్న ఈ కథలను కొరియన్‌లో రీమేక్ చేశారు. అక్కడ కూడా వీటిని విజయాలే వరిం చాయి. ఇప్పుడు ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ గల్ఫ్ స్ట్రీమ్ పిక్చర్స్, మరో నిర్మాణ ంస్థతో కలిసి ఈ కథ లతో హాలీవుడ్ చిత్రాలను నిర్మించనుంది. ఇండియన్ సినిమా నిర్మాణ సంస్థ పనోరమ స్టూడియోస్ నుంచి ఈ కథల రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది. ఇందులో నటించే నటీనటుల వివరాలు తెలియాల్సివుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)