అనన్య నాగళ్ల, ధనుష్ రఘుముద్రి ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం తంత్ర. శ్రీనివాస్ గోపిశెట్టి దర్శకుడు. నరేశ్‌బాబు.పి, రవి చైతన్య నిర్మాతలు. ఈ సందర్బంగా ట్రైలర్‌ని విడుదల చేశారు. రావణ కుమారుడైన ఇంద్రజిత్ నికుంబళాదేవి ఉపాసకుడు. అతడు నికుంబళాయాగం పూర్తిచేసి యుద్ధరంగంలోకి అడుగుపెడితే ఇక అతడ్ని ఓడించడం ఎవరి వల్లా కాదు. అందుకే నికుంబళాదేవికి పూజచేస్తున్న ఇంద్రజిత్‌పై వానర సైన్యంతో దాడిచేస్తాడు లక్ష్మణుడు. చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. నికుంబళ దేవి ఓ క్షుద్ర దేవత. ఇంద్రజిత్ తలపెట్టిన పూజ క్షుద్రపూజ.. అంటూ మీసాల తాంత్రిక పూజల గురించి లక్ష్మణ్ మీసాల చెప్పే ఎపిసోడ్‌తో తంత్ర ట్రైలర్ మొదలైంది. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
తాంత్రిక విద్యల నేపథ్యంలో ఆసక్తికరమైన ఎలిమెంట్స్‌ని గ్రిప్పింగ్‌గా రూపొందించాం. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బావుంటాయి అని దర్శకుడు చెప్పారు. ఇప్పటివరకూ వకీల్‌సాబ్ అనన్య, మల్లేశం అనన్య అని పిలిచి న మీరు, ఈ సినిమా తర్వాత తంత్ర అనన్య అని పిలుస్తారని అనన్య నాగళ్ల అన్నారు. ఇందులో హారర్‌తోపా టు రొమాన్స్, సెంటిమెంట్ అన్నీ సమపాళ్లలో ఉంటాయని హీరో ధనుష్ రఘుముద్రి తెలిపారు. ఇంకా సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధృవన్ కూడా మాట్లాడారు. ఈ నెల 15న సినిమా విడుదల కానుంది.