కోల్‌కతాకు చెందిన భరతనాట్య, కూచిపూడి నృత్య కళాకారుడు అమర్‌నాథ్ ఘోష్‌ను అమెరికాలో దుండగు లు కాల్చిచంపారని నటి దేవలీన భట్టాచార్జి తెలిపారు. అమర్‌నాథ్ ఘోష్ మిసోరిలోని సెంట్ లూయిస్‌లో ఈవెనింగ్ వాక్ చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారని ఆమె వెల్లడించారు. సెంట్ లూయిస్ లోని వాషింగ్టన్ యూనివర్సిటీలో ఘోష్ డ్యాన్స్‌లో మాస్టర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (ఎంఎఫ్ఏ) చదువుతున్నారు. అమర్ నాథ్ ఘోష్ ఆ కుటుంబంలో ఒక్కడే సంతానమని, అతడి తల్లి మూడేండ్ల కిందట మరణించగా, తండ్రి ఘోష్ చిన్ననాటే మరణించారని నటి పేర్కొన్నారు. ఘోష్ భౌతిక కాయాన్ని భారత్ తరలించేందుకు సహకరించాలని అమెరికాలోని భారత రాయబార కార్యాలయం, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జై శంకర్, ప్రధాని నరేంద్ర మోదీకి ఆమె విజ్ఞప్తి చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)