యుద్ధాల కోసం చైనా సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నది. కాల్పులు జరుపగల రోబో శునకాలను అభివృద్ధి చేస్తున్నది. ఈ రోబో కుక్కలు పెద్ద ఎత్తున కాల్పులు జరపగలవని చైనా మిలిటరీ చెప్తున్నది. వీటి చేత ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌కు డిస్కస్‌ను తీసుకెళ్లడం వంటి చిన్న చిన్న పనులను చేయిస్తున్నది. అయితే ఇదంతా ప్రచార ఆర్భాటమేనని విమర్శకులు చెప్తున్నారు. ఈ రోబో కుక్కల నిర్మాణ శైలిని బట్టి, అవి ప్రామాణిక ఆయుధాలను తట్టుకునేందుకు తగినవి కావని అంటున్నారు. అవి శిక్షణ పొందిన సైనికుడి మాదిరిగా వేగంగా, కచ్చితత్వంతో కాల్పులు జరపడం అసాధ్యమని చెప్తున్నారు.