ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ -రాధికా మర్చంట్ ఓ ఇంటివారు కాబోతున్న విషయం తెలిసిందే. వివాహ వేడుకలో భాగంగా నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారాయి. ఈ వేడుకలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి సెలబ్రిటీలు హాజరయ్యారు. యావత్ ప్రపంచా న్ని షేక్ చేసిన తెలుగు పాట నాటు నాటు ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లో ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్‌కు ముగ్గురు స్టార్ సెలబ్రిటీలు డ్యాన్స్ చేసి అభిమానులను హోరెత్తించారు. ఆస్కార్ విజేతగా నిలిచిన నాటు నాటు సాంగ్‌కు బాలీవుడ్ ఖాన్ త్రయం షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్.. తమదైన స్టైల్‌లో హుక్ స్టెప్పులతో కలిసి స్టైలిష్ స్టెప్పులేశారు. రాంచరణ్ కూడా వీరితో జాయిన్ అయ్యాడు.