Namaste NRI

సీక్రెట్‌ బంకర్‌ నిర్మించుకుంటోన్న జుకర్‌బర్గ్‌.. ఎక్కడో తెలుసా?

మెటా సీఈవో, ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ ప్రపంచ కుబేరుల్లో ఒకరుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. హవాయి ద్వీపాల్లోని కవాయిలో కొంత భూమి కొనుగోలు చేసేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు చేశారట.  అక్కడే ఓ విలసవంతమైన ఎస్టేట్‌ను నిర్మించుకునే పనిలో ఉన్నాడని సమాచారం. ఇందులో ఓ రహస్య బంకర్‌ను ఏర్పాటు చేసుకుంటున్నారని తెలిసింది. హవాయి ద్వీపాల్లోని కువాయి ప్రాంతాల్లో దాదాపు 1400 ఎకరాల భూమిని జుకర్‌బర్గ్‌ కొనుగోలు చేశారు. ఇందులో దాదాపు 5 వేల చదరపు అడుగుల్లో బంకర్‌ నిర్మిస్తున్నారు. విద్యుత్తు, ఆహారం వంటి సదుపాయాలు ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా ఇందుకోసం 260 మిలయన్‌ డాలర్లు ఖర్చు పెడుతున్నారని తెలిసింది.  దీనిపై జుకర్‌బర్గ్‌ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన చేయలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events