Skip to main content

Namaste NRI

న‌వ‌దీప్ 2.O.. ల‌వ్ మౌళి నుంచి షీఈజ్ రియ‌ల్ లిరిక‌ల్ వీడియో

నవదీప్‌, పంఖురి గిద్వానీ జంటగా నటిస్తున్న చిత్రం లవ్‌ మౌళి. అవనీంద్ర దర్శకుడు. నైరా క్రియేషన్స్‌ శ్రీకర స్టూడియోస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలోని  షీ ఈజ్‌ రియల్‌  అనే లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. గోవింద్‌ వసంత్‌ స్వరాలు అందించిన ఈ చిత్రానికి అనంత్‌శ్రీరామ్‌ సాహిత్యాన్నందించారు. శరత్‌ సంతోష్‌, జిబా టామీ ఆలపించారు. దర్శకుడు మాట్లాడుతూ డిఫరెంట్‌ కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తు న్నాం. నా జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకున్నా. నవదీప్‌ పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. ప్రేమలోని భిన్న కోణాన్ని ఆవిష్కరిస్తూ కథ సాగుతుంది అన్నారు. ఈ చిత్రానికి నిర్మాణం: సి స్పేస్‌, రచన-దర్శకత్వం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌: అవనీంద్ర.

Social Share Spread Message

Latest News