అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ ప్రథమ మహిళ, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిచెల్ ఒబామా పోటీ చేయబోతోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై మాజీ ఫస్ట్ లేడీ మిచెల్ తాజాగా క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయట్లేద ని స్పష్టం చేశారు. ఈ మేరకు మాజీ ప్రథమ మహిళ కార్యాలయం స్పష్టతనిచ్చింది. మిచెల్ ఒబామా అధ్యక్ష పదవికి పోటీ చేయట్లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. మిచెల్ఒబా మాకు రాబోయే 2024 ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసే ఉద్దేశం లేదని స్పష్టం చేసింది. అయితే, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్, వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఎన్నికల ప్రచారానికి మద్దతు ఇస్తారని వెల్లడించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)