నార్నే నితిన్ హీరోగా రూపొందుతున్న చిత్రం ఆయ్. నయన్ సారిక కథానాయిక. అంజి కంచిపల్లి దర్శకుడు. బన్నీ, విద్యా కొప్పినీడి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది. ఇది కోనసీమ నేపథ్యంలో సాగే సినిమా అని టైటిల్ చెప్పకనే చెబుతున్నది. ప్రస్తుతం పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. నార్నే నితిన్ తన స్నేహితులతో కలిసి నీళ్లలోకి దూకుతున్న ఈ స్టిల్ హీరో కేరక్టరైజేషన్‌కి అద్దం పడుతుందని మేకర్స్ చెబుతున్నారు. ఇందులో హీరో స్నేహితులుగా రాజ్‌కుమార్ కసిరెడ్డి, అంకిత్ నటించారు. వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతోన్న ఈ చిత్రానికి కెమెరా: సమీర్ కల్యాణి, సంగీతం: రామ్ మిర్యాల.