అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన కాల్పుల్లో ఏడుగురు గాయపడ్డారు. సిటీ బస్ స్టాప్ వద్ద కాల్పుల ఘటన జరిగింది. గాయపడ్డవారిని ఐన్‌స్టీన్ మెడికల్ సెంటర్‌కు తీసుకెళ్లారు. తుపాకీ కాల్పుల్లో రూట్ 18 బస్సు, రూట్ 67 బస్సు చిక్కుకున్నాయి. ఆ బస్సుల వద్ద గన్‌ఫైర్ జరిగినా, వాటిల్లో ఉన్న ప్రయాణికులకు మాత్రం ఎటు వంటి గాయాలు కాలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో 911 కాల్స్ వచ్చినట్లు పోలీసు ప్రతినిధి టాన్య లిటిల్ తెలిపారు. క్రాస్ ఆన్ ఎలిమెంటరీ స్కూల్ సమీపంలో కాల్పుల ఘటన జరిగింది. ఆ బాధితుల్లో విద్యా ర్థులు ఎవరైనా ఉన్నారో లేదో తెలియదని పోలీసులు తెలిపారు. కాల్పులు జరిగిన సమయంలో స్కూల్ విడిచి పెట్టారు. కానీ కాల్పుల శబ్ధాలు వినగానే, ఆ పిల్లలను మళ్లీ స్కూల్లో లాక్ చేశారు. బస్సులోని ఇద్దరు ప్రయా ణికుల మధ్య జరిగిన మాటల ఘర్షణ ఆ తర్వాత అది భౌతిక దాడికి దారి తీసింది. ఓ వ్యక్తి 9ఎంఎం గన్‌తో ఫైర్ చేశాడు. గత కొన్ని రోజుల్లో అమెరికాలో జరిగిన నాలుగవ కాల్పుల ఘటన ఇది.