అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ కీలక ప్రకటన చేశారు. ఎల్పీజీ సిలిండర్ గ్యాస్‌పై రూ.100 తగ్గిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ఇండ్లపై ఆర్థిక భారం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నారీ శక్తికి చాలా లబ్ధి చేకూరుస్తుందని అన్నారు. వంట గ్యాస్ ధరను అందుబాటులోకి తీసుకురావడం వల్ల, కుటుంబాలకు ఆర్థిక సహకారం అందుతుందని, ఆరోగ్యక రమైన వాతావరణం ఏర్పడుతుందని ఆయన తెలిపారు. మహిళల సాధికారత కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఆ కోణంలోనే ఈ చర్య చేపట్టామని, మహిళల జీవితాలు సరళం తరం చేసేందుకు ఈ ప్రక్రియ ఉపయోగపడుతుందని మోదీ అన్నారు.