ఆర్పీ పట్నాయక్ రికార్డ్ చేసిన సంపూర్ణ భగవద్గీత తాత్పర్యంలోని విశ్వరూప సందర్శనం అధ్యాయాన్ని హీరో విశ్వక్‌సేన్ లాంచ్ చేశారు.ఈ సందర్భంగా పట్నాయక్ మాట్లాడారు. జీవితాన్ని ఎలా కావాలని కోరుకుంటు న్నామో అలా మార్చేది భగవద్గీత. జీవితంలో ఎటు వెళ్లాలని కోరుకుంటున్నామో అటు తీసుకెళ్లేది భగవద్గీత. కృష్ణభగవానుడు బోధించిన భగవద్గీతను ఎందరో మహనీయులు తాత్పర్యం చెడకుండా పునఃరచించారు. వారిలో స్వామి ముకుందనంద రాసిన గీత అందరికీ సులువుగా అర్థమయ్యేలా వుంటుంది. యువతను దృష్టిలోపెట్టకుని చేసిన భగవద్గీత ఇది. బతుకు మొదలుపెట్టేముందు వినాల్సినది భగవద్గీత అన్నారు.
ఇది భగవానుడు నాతో చేయించిన కార్యం. నేను నిమిత్తమాత్రుడ్ని. ఈ ప్రయాణంలో తోడ్పడిన వారందరికీ పేరుపేరున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం, విశ్వరూప సందర్శన అధ్యాయం నేను విడుదల చేయడం నా అదృష్టం. భగవద్గీత తాత్పర్యం అందరికీ అర్థమయ్యేలా రికార్డ్‌చేసిన ఆర్పీ సార్‌కి థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇది నిజంగా చాలా గొప్ప కార్యం అన్నారు విశ్వక్‌సేన్. ఇది చిరకా లం నిలిచివుండే ప్రాజెక్ట్ అని దర్శకుడు దశరథ్, జె.కె.భారవి, రఘు కుంచె, సింగర్ కౌశల్య, జెమిని సరేశ్ తదితరులు అన్నారు.