Namaste NRI

న్యూజెర్సీలో బీజేపీ ఆధ్వర్యంలో..ఛాయ్‌ పే చర్చ కార్యక్రమం

న్యూజెర్సీలోని ఎడిసన్‌ నగరంలో ఓవర్‌సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఛాయ్‌ పే చర్చ నిర్వహించారు.  ఓవర్‌సీస్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ బీజేపీ పూర్వ అధ్యక్షుడు కృష్ణారెడ్డి ఏనుగుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రధాని మోదీకి మూడోసారి విజయం చేకూరేలా ఛాయ్‌ పే చర్చ, కాలతాన్‌, చౌకీదార్‌ మార్చ్‌, కార్‌ క్యాలీలు వంటి పలు కార్యక్రమాలు నిర్వహించేందుకు మరోసారి ప్రణాళికలు రచిస్తున్నట్లు అధ్యక్షుడు డా. అడపా ప్రసాద్‌ తెలిపారు.

 ఓఎఫ్‌ బీజేపీ న్యూజెర్సీ టీం చరణ్‌ సింగ్‌, అమర్‌, ధీరన్‌, గణేశ్‌ మాట్లాడుతూ నోట్ల రద్దుతో అవినీతి, ఉగ్ర వాదం, వామపక్ష తీవ్రవాదం, నల్లధనం, నకిలీ నోట్లపై సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేశారన్నారు. ఓఎఫ్‌ బీజేపీ న్యూజెర్సీ తెలంగాణ కమిటీ టీం  సంతోష్‌ రెడ్డి,  శ్రీకాంత్‌ రెడ్డి, నాగ మహేందర్‌ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో మిత్ర పక్షాల సహకారంతో బీజేపీకి 400 సీట్లు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.  తెలంగాణ బీజేపీ ఎన్నారై జాయింట్‌ కన్వీనర్‌ విలాస్‌ జంబుల మాట్లాడుతూ  ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం విశ్వగురువుగా విరా జిల్లుతోందని, ఈ తరుణంలో ప్రజలంతా కర్తవ్యంగా భావించి మోదీ ఆశయాలను నెరవేర్చేలా కృషి చేయాల్సి న అవసరం ఉందన్నారు. బీజేపీ పటిష్టతకు, రాబోయే ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి బీజేపీ, తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు తోడ్పాటు అందించాలన్నారు. 

ఈ కార్య క్రమానికి ఓఎఫ్‌ బీజేపీ సభ్యులు హరి సేతు, దీప్‌ భట్‌, ధీరేన్‌ పటేల్‌, గణేష్‌, మల్లికార్జున, లీనా భట్‌, దీప్తి సురేష్‌ జానీ, శరద్‌  అగర్వాల్‌, వంశీ యంజాల, మధుకర్‌ రెడ్డి, ప్రదీప్‌ కట్టా, అల్కా బిజుర్వేదీ, సాయి దత్త పీఠం నుంచి రఘు శంకరమంచి, ఇతర సంస్థల నుంచి పలువురు మద్దతు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events