అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో ఈసారి ట్రంప్ గెలవడం అసాధ్యమే అని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ అనుమా నాలు వ్యక్తం చేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం ఎవరు వహిస్తారన్న అంశంపై మాక్రన్‌ను ప్రశ్నించగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో నాటో దళాల మోహరింపును ఆయన వ్యతిరేకించారు. రష్యా విక్టరీని అడ్డుకునేందుకు తమ దేశం ఏమైనా చేస్తుందని అన్నారు. ప్రస్తుతం ఉన్న దశలో రష్యాతో చర్చలు నిర్వహించలేమన్నారు. చర్చలకు తానెప్పుడూ సిద్ధమే అని, కానీ దీక్షగల, శాంతియుత వ్యక్తి కావాలన్నారు. ఏదో ఒక రోజు ఎవరో ఒకరు రష్యా అధ్యక్షుడితో చర్చలు నిర్వహిస్తారని ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఒకవేళ అమెరికా ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తే ఆయన్ను శాంతి చర్చలకు వాడుకుంటారా అని మాక్రన్ ను ప్రశ్నించారు. ఆ సమయంలో మాక్రన్ సమాధానం ఇస్తూ.. తనకు తెలిసినంత వరకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ గెలుస్తారని అనుకోవడం లేదన్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో ఒకవేళ తాను గెలిస్తే, 24 గంటల్లోనే ఉక్రెయిన్ సమస్యను తీర్చనున్నట్లు ఇటీవల ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.