ఆనంద్ దేవరకొండ కథానాయకుడిగా రూపొందుతున్న చిత్రం డ్యూయెట్. రితిక నాయక్ కథానాయిక. మిథున్ వరదరాజ కృష్ణన్ దర్శకత్వం. ఈ చిత్రాన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తు న్నారు. ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా డ్యూయెట్ సినిమలో తాను పోషిస్తున్న మదన్ పాత్ర లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. మనసంతా ప్రేమను నింపుకున్న ప్రేమికుడిగా ఇందులో ఆనంద్ దేవర కొండ కనిపిస్తారని, త్వరలోనే డ్యూయెట్ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తామని మేకర్స్ తెలిపారు. విభిన్న మైన ప్రేమకథాచిత్రంగా రూపొందుతోన్న డ్యూయెట్ ప్రస్తుతం నిర్మాణ దశలో ఉందని, ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేలా దర్శకుడు ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారని నిర్మాత తెలిపారు. రావురమేశ్ ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)