2018లో మృణాల్‌ఠాకూర్ నటించిన చిత్రం లవ్ సోనియా. మానవ అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కి ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. ఆ సినిమాలో మృణాల్ అద్భుతంగా నటించడమే కాదు, పాత్ర పరంగా కథానాయికలు చేయలేని సాహసాలను చేసిందనే చెప్పాలి. న్యూయార్క్‌లోని యూఎన్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన హ్యూమన్ కాప్ట్ ఆఫ్ కాన్‌ఫ్లిక్ట్ రిలేటెడ్ సెక్సువల్ వయోలెన్స్ కార్యక్రమానికి మృణాల్ హాజరవ్వనుంది. మావన అక్రమ రవాణా, బాధితుల సంఘర్షణ, లైంగిక హింస, వాటి దుష్పరిణామా లపై ఈ కార్యక్రమంలో పానెల్ చర్చించనుంది. ఆదే నేపథ్యంలో రూపొందిన లవ్ సోనియా సినిమాలో హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితురాలిగా మృణాల్ నటించిన కారణంగా సంస్థ ప్రతినిథులు ఈ చర్చలో ఆమెను కూడా భాగస్వామిని చేశారు.
ఈ కార్యక్రమంలో మానవ అక్రమరవాణా, తర్వాతి పరిణామాలపై కీలక అంశాలను మృణాల్ ప్రస్తావించను న్నది. ఈ సందర్భంగా మృణాళ్ ఆనందం వ్యక్తం చేస్తూ ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం. లవ్ సోనియా లోని నా పాత్ర ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ సమస్యలోని సంక్లిష్టతను లోతుగా అధ్యయనం చేసే అవకాశం నాకు దక్కింది అని చెప్పుకొచ్చింది. ఈ కార్యక్రమంలో మృణాల్‌తో కలిసి పలువురు బాలీవుడ్, హాలీవుడ్ ప్రముఖులు పాల్గొననున్నారు.