పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన వద్ద సుదీర్ఘ కాలంగా సలహాదారుగా పనిచేస్తున్న మొహమ్మద్ ముస్తఫా ను పాలస్తీనా అథారిటీకి కొత్త ప్రధానిగా నియమించారు. ఇజ్రాయెల్‌పై దాడి అనంతరం పాలస్తీనాకు ప్రధానిగా ఉన్న మొహమ్మద్ శతాయే ఫిబ్రవరిలో రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రధాని పేషీకి సంబంధించిన నిర్ణయాలు అధ్యక్షుడే తీసుకుం టూ వచ్చారు. అయితే, పూర్తి స్థాయిలో ఓ ప్రధానిని నియమించాలని భావించిన అధ్యక్షుడు మహమూద్, తన వద్ద సలహాదారుగా పనిచేస్తున్న ముస్తఫాకు ప్రధాని బాధ్యతలు అప్పగించారు. పాలస్తీనా అథారిటీలో సంస్క రణలు చేపట్టాలని ఒత్తిడి నెలకొన్న నేపథ్యంలో ఈ నియామకాన్ని చేపట్టారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)