శ్రీవిష్ణు కథానాయకుడిగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ నటించిన చిత్రం ఓం భీమ్ బుష్. శ్రీహర్ష కొనుగంటి దర్శకుడు. వి.సెల్యులాయిడ్, బలుసు సునీల్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీవిష్ణు మాట్లాడారు. ఈ నెల 22న మా థియేటర్స్‌కి రండి. మీరు నవ్విన నవ్వులకు థియేటర్లు బద్దలైపోతాయి. పిచ్చిపిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. ఫ్రెండ్స్‌తో రండి. ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు. కేవలం నవ్వించడానికే తీసిన సినిమా ఇది. ఇందులో నన్నూ భాగం చేసిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు. ప్రేక్షకులకు డబుల్‌డోస్ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తామని ప్రామిస్ చేస్తున్నామని, నిర్మాతల వల్లే ఇంత క్రేజీ మూవీ చేయగలిగామని ప్రియదర్శి చెప్పారు. ట్రైలర్‌లో వుండే ఎనర్జీకంటే వందరెట్లు ఎనర్జీ సినిమాలో ఉంటుందని, థియేటర్లకు వచ్చినవాళ్లను టెన్‌టైమ్స్ ఎంటర్‌టైన్ చేస్తామని, ఇది తమ గ్యారటీ అని దర్శకుడు తెలిపారు.