పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) అమలు చేసేందుకు ఇటీవల కేంద్ర సర్కారు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై అమెరికా తన నిర్ణయాన్ని ప్రకటించింది. సీఏఏ అమలును క్షుణ్ణంగా పరిశీలిస్తు న్నామని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. మార్చి 11వ తేదీన రిలీజైన సీఏఏ నోటిఫికేషన్ పట్ల ఆందోళనగా ఉందని విదేశాంగ శాఖ ప్రతినిది మాథ్యూ మిల్లర్ తెలిపారు. సీఏఏను ఎలా అమలు చేస్తారన్న విషయాన్ని పరిశీలిస్తున్నామని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్ని మతాలకు స్వేచ్ఛ ఉంటుందని మిల్లర్ తెలిపారు.