Namaste NRI

సార్వత్రిక ఎన్నికలకు మోగిన నగారా..షెడ్యూల్‌ ఇదే

సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. లోక్‌సభతో పాటు ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్‌, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 19న తొలి విడత పోలింగ్‌ జరగనుంది. ఇక నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన ఏపీలోని 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు.
ఎపి,తెలంగాణ ఎన్నిక‌ల షెడ్యూల్
ఏప్రిల్ 18న ఏపీలో ఎన్నికల నోటిఫికేషన్.
ఏప్రిల్ 18 నుంచి 25 వరుకు నామినేషన్ల స్వీకరణ.
ఏప్రిల్ 26న నామినేషన్ల పరిశీలన.
ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు.
మే 13న పోలింగ్‌.
జూన్ 4న ఓట్ల లెక్కింపు.
ఏపీ, తెలంగాణలో ఒకే రోజున లోక్‌సభ పోలింగ్‌. తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్‌సభ ఎన్నికలు నిర్వహించనున్నారు.
మొత్తం 7 దశాల్లో లోక్‌సభ ఎన్నికలు :

లోక్‌సభ ఎన్నికలు ఇలా
తొలి దశ: ఏప్రిల్‌ 19, 102 స్థానాలు (21 రాష్ట్రాలు)
రెండో దశ: ఏప్రిల్‌ 26, 89 స్థానాలు (13 రాష్ట్రాలు)
మూడో దశ: మే 7, 94 స్థానాలు (12 రాష్ట్రాలు)
నాలుగో దశ: మే 13, 96 స్థానాలు (10 రాష్ట్రాలు)
ఐదో దశ: మే 20, 49 స్థానాలు (8 రాష్ట్రాలు)
ఆరో దశ: మే 25, 57 స్థానాలు (7 రాష్ట్రాలు)
ఏడో దశ: జూన్‌ 1, 57 స్థానాలు (8 రాష్ట్రాలు)

లోక్‌సభ: తొలి దశ
నోటిఫికేషన్‌: 20 మార్చి, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 27 మార్చి
నామినేషన్ల పరిశీలన: 28 మార్చి
ఉపసంహరణకు ఆఖరు తేదీ: 30 మార్చి
పోలింగ్‌ తేదీ: ఏప్రిల్‌ 19

లోక్‌సభ : రెండో విడత
నోటిఫికేషన్‌: 28 మార్చి, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 04
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్‌ 5వ తేదీ
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 8
పోలింగ్‌ తేదీ: ఏప్రిల్‌ 26

లోక్‌సభ: మూడో దశ
నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 12, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 19
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 20
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 22
పోలింగ్‌ తేదీ: మే 7

లోక్‌సభ: నాలుగో విడత
నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 18, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 25
నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 26
ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 29
పోలింగ్‌ తేదీ: మే 13

లోక్‌సభ: ఐదో విడత
నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 26, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 3
నామినేషన్ల పరిశీలన: మే 4
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 6
పోలింగ్‌ తేదీ: మే 20

లోక్‌సభ: ఆరో విడత
నోటిఫికేషన్‌: ఏప్రిల్‌ 29, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 6
నామినేషన్ల పరిశీలన: మే 7
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 9
పోలింగ్‌ తేదీ: మే 25

లోక్‌సభ: ఏడో విడత
నోటిఫికేషన్‌: మే 7, 2024
నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 14
నామినేషన్ల పరిశీలన: మే 15
ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 17
పోలింగ్‌ తేదీ: జూన్ 1

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events