అధిక రాబడి కలిగిన దేశంగా భూటాన్ ఎదిగేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటిం చారు.భారత్`భూటాన్ మధ్య ఉన్న సౌర, పవన విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొం దించుకునేందుకు ఇరుదేశాల ప్రధానమంత్రులు అంగీకరించారని మోదీ`తోబ్గే సమావేశం జరిగిన రెండు రోజుల తర్వాత వెలువడిన ఉమ్మడి ప్రకటన తెలిపింది. భూటాన్ 12 పంచవర్ష ప్రణాళిక కోసం భారత్ రూ. 5000 కోట్ల సాయం అందించింనందుకు తోబ్గా కృతజ్ఞతుల తెలిపారని పేర్కొంది. వ్యవసాయ, ఆరోగ్య, విద్య, నైపుణ్యరంగాలు, మౌలికవసతుల కల్పనకు ఈ నిధులు తోడ్పాడతాయని తోబ్గే అన్నారని నివేదిక వెల్లడిర చింది. ఇరుదేశాల మధ్య రైల్వే లైన్ల నిర్మాణంలో అభివృద్ధిని ప్రధానులు స్వాగతించినట్లు పేర్కొంది. 1020 మెగావాట్ల హైడ్రో పవర్ ప్రాజెక్టు పునత్‌షాంగ్చు`2 పట్ల ఇరుదేశాలు సంతృప్తి వ్యక్తం చేసినట్లు నివేదిక తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)