దగ్గుబాటి ఇంట పెళ్లి బాజా మోగింది. ప్రముఖ నటుడు దగ్గుబాటి వెంకటేశ్, శ్రీమతి నీరజల కుమార్తె హవ్య వాహిని, డాక్టర్ పాతూరి వెంకట రామారావు, అరుణల కుమారుడు డాక్టర్ నిశాంత్ వివాహబంధంతో ఒక్కట య్యారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ వివాహ వేడుకలో కుటుంబసభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు. ఆనందోత్సాహాలతో కూడిన సంగీత్, పెళ్లి కూతురు ఫంక్షన్స్‌తో వేడుకలు అంగరంగవైభవంగా జరిగాయి.