అమెరికా అధ్యక్షుడిగా తనను ఎన్నుకోకపోతే దేశంలో రక్తపాతం తప్పదని రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఒహియోలోని వాండాలియాలో జరిగిన ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. అధ్యక్ష ఎన్నిక జరుగనున్న నవంబర్ 5 అమెరికా చరిత్రలో అత్యంత ముఖ్యమైన తేదీ అని చెప్పారు. అధ్యక్షుడిగా తాను ఎన్నికైతే అమెరికాకు దిగుమతి చేసుకున్న కార్లను చైనా విక్రయించలేదని పేర్కొన్నా రు. మెక్సికోలో కార్లను తయారు చేసి వాటిని అమెరికన్లను అమ్మాలని డ్రాగన్ దేశం చూస్తున్నదని విమర్శించారు. తన ప్రత్య ర్థి అయిన జో బైడెన్‌ను చెత్త అధ్యక్షుడిగా అభివర్ణించారు. వలసదారులకు మిలియన్ల కొద్ది వర్క్ పర్మిట్లు మంజూరు చేయడం ద్వారా ఆఫ్రికన్-అమెరికన్ ఓటర్లకు బైడెన్ వెన్నుపోటుపొడిచారని ఆరోపించారు. అయి తే ఈ వ్యాఖలు ఏ ఉద్దేశంలో చేశారో స్పష్టంగా వెల్లడించలేదు.