Namaste NRI

త్వరలోనే అహం చిత్రం షూటింగ్‌ ప్రారంభం

యువ దర్శకుడు విజయ్‌ కుమార్‌ కొండా త్వరలో అహం పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. ఈ సినిమా ద్వారా సీనియర్‌ నిర్మాత కుమారుడు హీరోగా పరిచయం కానున్నాడు. నటుడు శివాజీ నెగెటివ్‌ ఛాయ లున్న పాత్రను పోషించనున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ పొడక్షన్‌ వర్క్‌ జరుగుతున్నది. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుంది. ఈ సినిమా కోసం అనూప్‌ రూబెన్స్‌ను సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నారనీ, ప్రీ ప్రొడక్షన్‌ పనులు శరవేగంతో జరుగుతున్నాయనీ సమాచారం. త్వరలోనే అహం చిత్రం షూటింగ్‌ ప్రారంభం కానున్నదని అంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కించబోతున్న ఈ సినిమా వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events