Namaste NRI

ఇలాంటి ఘటన దేశంలో ఇదే తొలిసారి … టికెట్ ఇవ్వలేదని

ఓ పార్టీ ఒకరికి టికెట్ ఇవ్వడానికి నిరాకరించిందంటే, వేరే పార్టీలోకి జంప్ అయి అక్కడ టికెట్ సంపాదించ డమో లేక స్వతంత్ర అభ్యర్థిగానో పోటీ చేస్తాడు. ఆర్థిక స్థోమత లేని వ్యక్తి ఇంట్లో కూర్చుంటాడు లేదా పార్టీపై బహిరంగంగా విమర్శలు చేసి చల్లబడతాడు. అంతేగా అయితే ఒకరు మాత్రం పార్టీ టికెట్ ఇవ్వలేదని ఏకంగా ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇలాంటి ఘటన దేశంలో ఇదే తొలిసారి. తమిళనాడుకు రాష్ట్రం ఈరోడ్‌ నియోజకవర్గానికి గణేశ మూర్తి(74) ఎండీఎంకే పార్టీ నుంచి ఎంపీగా ఉన్నారు. ఆయనకు లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ టికెట్ నిరాకరించింది. ఎండీఎంకే ప్రస్తుతం తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకేతో చేతులు కలిపింది.

పొత్తులో భాగంగా కొన్ని సీట్లను అధికార పార్టీకి త్యాగం చేశారు. ఇందులో ఈరోడ్‌కి డీఎంకే నుంచి ప్రకాశ్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కి సన్నిహితుడిగా పేరు తెచ్చుకున్న ఈయనకే ఈరోడ్ టికెట్ కన్ఫార్మ్ కావడంతో ఆ నియోజకవర్గ టికెట్ ఆశించిన గణేశ మూర్తికి ఆశాభంగం తప్పలేదు.పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించలేక,  బయటకీ చెప్పుకోలేక గణేశ లోలోపలే మదనపడ్డారు. చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఆయన పురుగుల మందు తాగారని కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్నారని తెలిపారు.

టికెట్ నిరాకరించిన కారణంతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారని వారు అంటున్నారు. 40 ఏళ్లకుపైనే రాజకీయాల్లో ఉన్న ఆయన ఇలా బలవన్మరణానికి పాల్పడటం ఆందోళన కలిగించిందని అభిమానులు అంటున్నారు. 2009, 2019లో రెండు సార్లు గ‌ణేశ మూర్తి ఈరోడ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించారు. గ‌తంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. రాష్ట్ర మంత్రిగా కూడా పని చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events