Namaste NRI

ఈ సినిమా తప్పకుండా హిట్‌ అవుతుంది : విశ్వక్‌సేన్‌

రామ్జ్‌ హీరోగా రూపొందుతున్న చిత్రం ఫైటర్‌ రాజా. కృష్ణప్రసాద్‌ వత్యం దర్శకుడు. దినేష్‌ యాదవ్‌, పుష్పక్‌ జైన్‌ నిర్మాతలు. ఈ సినిమా టీజర్‌ను హీరో విశ్వక్‌సేన్‌ విడుదల చేశారు. తండ్రి అడుగుజాడల్లో నటించే కొడుకు కథే ఈ సినిమా అని టీజర్‌ చెబుతున్నది. హీరో కేరక్టరైజేషన్‌ ఈ సినిమాకు హైలైట్‌ అని మేకర్స్‌ చెబు తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రతిదీ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. పోస్టర్‌ డిజైన్‌. కలర్‌ గ్రేడింగ్‌, విజు వల్స్‌ అన్నీ బావున్నాయి. టీజర్‌ ఆసక్తికరంగా ఉంది. చాలారోజుల తర్వాత చంద్రశేఖర్‌ యేలేటి సినిమా వైబ్‌ ఈ టీజర్‌లో చూశాను. రామ్జ్‌లోని ప్రతిభ సర్‌ప్రైజ్‌ చేసింది. తప్పకుండా ఈ సినిమా హిట్‌ అవుతుంది అని విశ్వక్‌సేన్‌ శుభాకాంక్షలు అందించారు. ఇంకా చిత్ర యూనిట్‌ మాట్లాడారు. మాయాకృష్ణన్‌ కథానాయికగా నటి స్తున్న ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, చక్రధర్‌, శివ నందు, రోషన్‌ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీధర్‌ కాకిలేటి, సంగీతం: స్మరణ్‌ సాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events