బాలకృష్ణ హీరోగా రూపొంది, అఖండ విజయాన్ని సాధించిన చిత్రం లెజెండ్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రం రీరిలీజ్ సందర్భం గా ఏర్పాటు చేసిన వేడుకలో బాలకృష్ణ మాట్లాడారు. మార్చి 30న మళ్లీ లెజెండ్ విడుదలవుతోంది. మళ్లీ వంద రోజుల పండుగ జరుపుకుంటాం అని అన్నారు. మంచి ఉద్దేశంతో తీసిన సినిమాలను జనం ఆదరిస్తారు. ఇలాంటి సినిమాలు మరిన్ని తీయాలని ప్రోత్సహిస్తారు. ఇది బాధ్యతగా తీసిన సినిమా. యువతకి సమాజం పట్ల స్పృహ, చైతన్యం కలిగించాలనే సంకల్పంతో ఎంచుకున్న కథ. ఇందులో మహిళలను ఉద్దేశించి మంచి సందేశం ఉంది. సింహా, లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్‌కేసరి తృప్తిని ఇవ్వడంతోపాటు మంచి సినిమాలు చేయాలనే కసిని పెంచాయి అన్నారు. ఇంకా బోయపాటి, నిర్మాతలు మాట్లాడారు.