Namaste NRI

డియర్‌ వచ్చేది ఆ రోజే

జి.వి.ప్రకాశ్‌, ఐశ్వర్య రాజేష్‌ జంటగా నటిస్తున్న కామెడీ ఫ్యామిలీ డ్రామా డియర్‌. ఆనంద్‌ రవిచంద్రన్‌ దర్శకుడు. వరుణ్‌ త్రిపురనేని, అభిషేక్‌ రామిశెట్టి, జి.పృథ్వీరాజ్‌ నిర్మాతలు. తెలుగు రాష్ర్టాల్లో గ్రాండ్‌గా ఈ సినిమా విడుదల కానున్నదని మేకర్స్‌ తెలిపారు. జీవీ ప్రకాష్‌ స్వరాలందించిన ఈ చిత్రం పాటలు తమిళ నాట యూత్‌ని బాగా అలరిస్తున్నాయని, త్వరలో తెలుగులోనూ విడుదల కానున్నాయని నిర్మాతలు తెలిపారు. కాళీ వెంకట్‌, ఇళవరసు, రోహిణి, తలైవాసల్‌ విజయ్‌, గీతా కైలాసం, నందిని తదితరులు ఇతరపాత్రలు పోషి స్తున్నారు.  ఈ సినిమా తమిళ వెర్షన్‌ ఏప్రిల్‌ 11న, తెలుగు వెర్షన్‌ ఏప్రిల్‌ 12న ఒక్కరోజు తేడాతో విడుదల కాను న్నాయి. తెలుగు వెర్షన్‌కి సంబందించిన ఆంధ్ర థియేట్రికల్‌ హక్కులను అన్నపూర్ణ స్టూడియోస్‌ కొనుగోలు చేయగా, తెలంగాణ థియేట్రికల్‌ హక్కులను ఏషియన్‌ సినిమాస్‌వారు దక్కించుకున్నారు. ఈ చిత్రానికి కెమెరా: జగదీశ్‌ సుందరమూర్తి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress