సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన చిత్రం టిల్లు స్వేర్. మల్లిక్‌రామ్ దర్శకుడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ టిల్లు స్కేర్ చిత్రాని కి విడుదలైన అన్ని కేంద్రాల్లో అద్భుతమైన స్పందన లభిస్తున్నది. ఉగాది, రంజాన్ పండుగలతో పాటు వేసవి సెలవులు ఉండటంతో వందకోట్ల కలెక్షన్స్ వస్తాయనే నమ్మకం ఉంది అన్నారు. సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడుతూ సబ్జెక్ట్‌పై నమ్మకంతో మంచి బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించారు. ఆల్ ఆడియెన్స్ అద్భుతం అంటు న్నారు అని చెప్పారు. తాను పోషించిన లిల్లీ పాత్రకు మంచి స్పందన లభిస్తున్నదని అనుపమ పరమేశ్వరన్ ఆనందం వ్యక్తం చేసింది. సినిమా ఆద్యంతం ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని దర్శకుడు పేర్కొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)