అరణ్మనై ఫ్రాంఛైజీ చిత్రాలు తమిళంతో పాటు తెలుగులో కూడా ఆదరణ పొందాయి. హారర్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులకు థ్రిల్‌ను పంచాయి. ఈ సిరీస్‌లో వస్తున్న నాలుగో చిత్రం బాక్. స్వీయ దర్శకత్వం లో సుందర్ సి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్నా, రాశీఖన్నా కథానాయికలు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో శివాని పాత్రలో కనిపించనుంది తమన్నా. ఈ చిత్రం ఆమె ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో తమన్నా మెరిసిపోతున్నది. హారర్ థ్రిల్లర్ కథాంశమిది. తమన్నా పాత్ర కథాగమనంలో కీలకంగా ఉంటుంది. శివాని వెనక దాగివున్న రహస్యమే మిటన్నది ఆసక్తికరం అన్నారు. వెన్నెల కిషోర్, శ్రీనివాసులు, ఢిల్లీ గణేష్, కోవై సరళ తదితరులు నటిస్తు న్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఇ. కృష్ణమూర్తి, సంగీతం: హిప్‌హాప్ తమిళ, తెలుగు రిలీజ్: ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, కథ, దర్శకత్వం: సుందర్ సి.