Namaste NRI

వినోదభరితంగా కొంచెం హట్కే

గురుచరణ్‌, కృష్ణ మంజూష ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కొంచెం హట్కే. అభిమాన థియేటర్‌ పిక్చర్స్‌ నిర్మించిన ఈ చిత్రానికి కృష్ణ రావూరి దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకురాలు నందినీరెడ్డి మాట్లాడుతూ  ట్రైలర్‌ ఆసాంతం వినోదభరితంగా ఉందని, ఆసక్తికరమైన కథతో చిత్రాన్ని తెరకెక్కించారని చెప్పింది. ఓ మిత్రబృందం సినిమా తీసే ప్రయత్నాల నేపథ్యంలో కథ నడుస్తుం దని, విభిన్నమైన కాన్సెప్ట్‌ ఇదని దర్శకుడు అవినాష్‌ తెలిపారు. అందరిని నవ్వించే చిత్రమిదని, సినిమా నేపథ్య కథతో మెప్పిస్తుందని గురుచరణ్‌ అన్నారు. ఏప్రిల్‌ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ చిత్రానికి కెమెరా: అనిల్‌ మల్లెల, సంగీతం: కె.ఎం.రాధాకృష్ణన్‌, దర్శకత్వం: అనివాష్‌ కుమార్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress