గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ డాక్టరేట్ అందుకున్నారు. తమిళనాడుకు చెందిన వేల్స్ యూనివర్శిటీ నిర్వహించి న స్నాతకోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా వచ్చిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ టీజీ సీతారాం రామ్ చరణ్‌కు గౌరవ డాక్టరేట్ సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు. దీంతో టాలీవుడ్ యాక్టర్‌గా చిన్న వయసులోనే డాక్టరేట్ అందుకున్న వ్యక్తిగా రామ్ చరణ్(39) నిలిచాడు. ఇక చరణ్‌కు ఈ అరుదైన గౌరవం దక్కడంతో ఆయన అభిమానులు ఫుల్ జోష్ లో ఉన్నారు. ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.