Namaste NRI

జూన్‌లో వచ్చేస్తున్నా .. భార‌తీయుడు 2

కమల్‌హాసన్‌ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా భారతీయుడు 2. దర్శకుడు శంకర్‌.  సిద్ధార్థ్‌, కాజల్‌ అగర్వా ల్‌, రకుల్‌ప్రీత్‌సింగ్‌, ప్రియా భవానీ, శంకర్‌, ఎస్‌.జె.సూర్య, బాబీ సింహా తదితరులు ఇతర పాత్రలు పోషిస్తు న్నారు.  ప్రస్తుతం సినిమా ప్రోస్ట్‌ప్రొడక్షన్‌ దశలో ఉంది. ఈ నెలాఖరున ట్రైలర్‌ను, జూన్‌లో సినిమాను పాన్‌ వరల్డ్‌ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహలు చేస్తున్నారు. ఇతర భాషల్లో ఇండియన్‌ 2గా విడుదల కానున్న ఈ చిత్రాన్ని తెలుగు మాత్రం భారతీయుడు 2 పేరుతోనే విడుదల చేస్తున్నామని నిర్మాత ల్లో ఒకరైన లైకా ప్రొడక్షన్స్‌ అధినేత సుభాస్కరన్‌ తెలిపారు.  ఈ చిత్రానికి కెమెరా: రవివర్మన్‌, సంగీతం: అనిరుద్‌ రవిచంద్రన్‌, ఎడిటింగ్‌: ఏ.శ్రీకర్‌ప్రసాద్‌, నిర్మాణం: లైకా ప్రొడక్షన్స్‌, రెడ్‌ జైంట్‌ మూవీస్‌. నిర్మాతలు: సుభాస్కరన్‌, జి.కె.ఎం.తమిళ్‌కుమరన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress