Namaste NRI

షికాగో తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు

అమెరికా ఇల్లినాయిస్‌లోని షికాగోలో షికాగో  తెలుగు అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఉగాది,  శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. షికాగోలోని బాలజీ టెంపుల్‌ ఆడిటోరియంలో ఈ వేడుకలను నిర్వహించా రు.  తెలుగు సంస్కృతి, భాష తెలిసేలా కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక సంగీత కార్యక్రమాలను నిర్వహిం చారు. సీటీఏ ( షికాగో తెలుగు అసోసియేషన్‌ ) సాంస్కృతిక డైరెక్టర్‌ సుజనా ఆచంట ఆహుతులకు స్వాగతం పలుకుతూ ఈ వేడుకలను ప్రారంభించారు. గణపతి ప్రార్థనతో ఈ కార్యక్రమం మొదలైంది. వేర్వేరు కార్యక్రమా ల ద్వారా తెలుగు భాష, సంస్కృతి ప్రోత్సహించడానికి అసోసియేషన్‌ తీసుకుంటున్న అంకితభావాన్ని సుచనా ఆచంట పేర్కొన్నారు. గురు రమ్య, రవిశంకర్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రదర్శించిన పలు భక్తిరస తెలుగు పాటలు అలరించాయి.  శోభా తమ్మన, జానకి నాయర్‌, ఆశా అడిగా, వనిత వీరవల్లి, సౌమ్య కుమారన్‌ మార్గదర్శకత్వంలో 100 మంది చిన్నారులు తమ ప్రదర్శనలతో ఆహుతులను అలరించారు. ఈ సందర్భంగా ఉగాది పచ్చడి పోటీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్దతు, సహకారం అందించి విజయవంతం చేసిన వాలంటీర్లు, ఆహుతులకు సీటీఏ అధ్యక్షుడు నాగేంద్ర వేగే ధన్యవాదాలు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో షికాగో తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు నాగేంద్ర వేగే, కల్చరల్‌ డైరెక్టర్‌ శ్రీమతి సుజనా ఆచంట,  సభ్యులు ప్రవీణ్‌ మోటూరు, రావు ఆచంట, శేషు ఉప్పలపాటి, అశోక్‌ పగడాల, ప్రసాద్‌ తాళ్లూరు, వేణు ఉప్పలపాటి, రాహుల్‌ విరాటాపు, రమేష్‌ మర్యాలతోపాటు ఏటీఏ సభ్యులు సత్య కడిమల్ల, కరుణాకర్‌ మాధవరం తదితరులు హాజరయ్యారు.   రాణి వేగే, సుజనా ఆచంట, అనిత గోలి, శ్రీ చిట్టినేని, మధు ఆచంట, అనూష విడపాలపాటి, సాయిచంద్‌ మేకల, భవాని సరస్వతి, సాయిచంద్‌ మేకల భవాని సరస్వతి, మాధవి తిప్పిశెట్టి, రత్న చోడ, వెంకట్‌ తొక్కాల, నాగభూషణ్‌ భీమిశెట్టి, పృద్వి సెట్టిపల్లి, సునీల్‌, రమేష్‌, నరేంద్ర, బాల, చక్రధర్‌, వివేక్‌ కిలారు, రామానుజం, శశిధర్‌, రమేష్‌, మృదుల తదితరులు పాల్గొన్నారు.  500 మందికి పైగా తెలుగు అసోసియేషన్‌ సభ్యులు హాజరయ్యారు. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress