ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడి తర్వాత పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరాన్ దాడిని పలు దేశాలు తీవ్రంగా ఖండించాయి. అయితే, సిరియాలోని తమ రాయబార కార్యాలయంపై దాడి ఇజ్రాయెల్ పనేనని, దానికి ప్రతీకారం తీర్చుకున్నామంటూ తన చర్యలను ఇరాన్ సమర్థించుకుంది. మరో వైపు ఇరాన్‌పై మరింత కఠిన ఆంక్షలు అమలు చేస్తామని అమెరికా స్పష్టం చేఇంది. రాబోయే రోజుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ , ఇరాన్ రక్షణ మంత్రిత్వ శాఖకు మద్దతిచ్చే సంస్థలపై కొత్త ఆంక్షలతో పాటు, ఇరాన్ క్షిపణి, డ్రోన్ కార్యక్రమాల పై కొత్త ఆంక్షలు విధించనున్నట్లు వైట్ హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లివన్ తెలిపారు.
ఇజ్రాయెల్‌పై ఇరాన్ వైమానిక దాడి అనంతరం అమెరికా అధ్యక్షుడు బిడెన్ జీ7 దేశాలతో సహా మిత్రపక్షాలు, భాగస్వాములు, కాంగ్రెస్‌లోని ద్వైపాక్షిక నాయకులతో సమగ్ర ప్రతిస్పందనను సమన్వయం చేస్తున్నారని జేక్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ఇరాన్‌ను లక్ష్యంగా చేసుకుని అమెరికా అనేక రకాల ఆంక్షలు విధించనుందని తెలిపారు. అమెరికా సైతం తన మితద్రేశాలు, భాగస్వామ్య దేశాలు సైతం ఇరాన్‌పై ఆంక్షలు విధించాలని ఆశిస్తుందన్నారు.