ప్రస్తుతం భారత దేశ జనాభా ఎంతో తెలుసా? అక్షరాల 144 కోట్లు. యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్‌ఎఫ్‌పీఏ) నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో 0 నుండి 14 ఏండ్ల వయస్సులో ఉన్న వారు 24 శాతం మంది ఉన్నట్టు నివేదిక పేర్కొన్నది. 2021లో నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. ప్రసవ సమయంలో శిశు మరణాలు సంఖ్య బాగా తగ్గినట్టు నివేదిక వెల్లడించింది. దేశ జనాభా లో 10 నుండి 19 ఏండ్ల మధ్యనున్న వారు 17 శాతం మంది ఉండగా, 10 నుండి 24 ఏండ్ల మధ్య ఉన్న వారు 68 శాతం ఉన్నారు. ఇక సీనియర్ సిటిజన్లు 7 శాతం ఉన్నారు. పురుషుల ఆయుర్దాయం 71 సంవత్సరా లు కాగా, స్త్రీల ఆయుర్దాయం 74 సంవత్సరాలుగా తేలిందని యూఎన్‌ఎఫ్‌పీఏ తెలిపింది.
2006-2023 మధ్య కాలంలో భారత్‌లో బాల్య వివాహాలు 23 శాతమని నివేదిక తేల్చింది. పీఎల్‌ఓఎన్ గ్లోబల్ పబ్లిక్ హెల్త్ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 640 జిల్లాల్లో ప్రసవానంతర మరణాల నిష్పత్తి లక్ష జననాలకు 70 కంటే తక్కువగా నమోదైంది. 114 జిల్లాల్లో మాత్రం ఈ నిష్పత్తి 210 కంటే ఎక్కువగా ఉన్నది. దాదాపు సగం మంది దళిత మహిళలకు ప్రసవానంతరం సంరక్షణ అందటం లేదని చెప్పింది.