సైబర్ యుద్ధాలను దీటుగా ఎదుర్కొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ చైనా సైన్యంలో ఇన్‌ఫర్మేషన్ సపోర్ట్ ఫోర్స్ ( ఐఎస్‌ఎఫ్) పేరుతో ఓ కొత్త విభాగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతి పెద్ద సైన్యమైన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి ఇది వ్యూహాత్మకంగానే కాకుండా కీలక స్తంభం గా నిలవనుందని పేర్కొన్నారు. చైనా సైన్యంలో అత్యున్నత కమాండ్ అయిన సెంట్రల్ మిలిటరీ కమిషన్ ( సీఎంసీ) అధిపతిగా, అధికార కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా (సీపీసీ) అధినేతగా, చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ వ్యహ రిస్తున్నారు. ఐఎస్‌ఎఫ్‌ను ఏర్పాటుచేయాలన్న ప్రధాన నిర్ణయాన్ని బలమైన సైన్యాన్ని తయారు చేసుకోవా ల్సిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని సీపీసీ, సీఎంసీలు తీసుకున్నాయని తెలిపారు. రాజకీయ, సైబర్ నేరాలను ఎదుర్కొనేందుకు 2015లో ఏర్పాటు చేసిన స్ట్రేటజిక్ సపోర్ట్ ఫోర్స్ ( ఎస్‌ఎస్‌ఎఫ్)కు నవీన రూపమే ఐఎస్‌ఎఫ్ అని పరిశీలకులు భావిస్తున్నారు.